సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఇండియా మరియు థాయ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో విజన్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ వారు ప్రదానం చేసే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు 2024-2025కు గాను సంగారెడ్డి జిల్లాసదాశివపేట మండలం, నిజాంపూర్ (కె) ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డాక్టర్.పోట్రు.రామకృష్ణ ఎంపికయ్యారు. ఈ మేరకు నిర్వాహకుల నుండి రామకృష్ణకు ఆహ్వానం అందింది. ఈ పురస్కారాన్ని ఫిబ్రవరి 16న హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా రామకృష్ణ అందుకుంటారని తెలిపారు. విద్యారంగంలో విశిష్ట సేవలు అందించే వారికి ఈ పురస్కారాలు ఇస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. రామకృష్ణ 2024 25 సంవత్సరానికి ఎస్.సీ.ఈ.ఆర్.టీ తెలంగాణ బెస్ట్ ప్రాక్టీసేస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా కూడా ఎంపికయ్యారు. అంతర్జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినందుకుగాను విజన్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ నిర్వాహకులకు రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
అంతర్జాతీయ పురస్కారానికి డా.పోట్రు.రామకృష్ణ ఎంపిక
Published On: January 18, 2025 5:30 pm
