Site icon PRASHNA AYUDHAM

తారా కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుల నియమాకానికి దరఖాస్తుల ఆహ్వానం: కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ

IMG 20251013 194746

Oplus_131072

సంగారెడ్డి, అక్టోబర్ 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా వివిధ విభాగాలలో పని చేయుటకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. తారా ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు బోధించుటకు ఆంగ్లంలో రెండు, పొలిటికల్ సైన్స్ 2, తెలుగు రెండు, గణితము రెండు, రసాయన శాస్త్రం 2, బోటనీ రెండు, కంప్యూటర్ సైన్స్ రెండు, జువాలజీ ఒకటి, కామర్స్ ఒకటి విభాగాలలో ఖాళీలు ఉన్నాయని, వీటికి సంబంధించి ఇంటర్వ్యూ 17వ తేదీ శుక్రవారం 10గంటల నుండి కళాశాలలో జరుగుతుందని, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకు హాజరు కావాలని అన్నారు. ఈ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పీ.జీ.తో పాటు నెట్ /సెట్/ పీహెచ్డీ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అభ్యర్థులకు చెల్లించే వేతనము గంటల వారీగా ఉంటుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అన్నీ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక జిరాక్స్ సెట్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ను తీసుకొని 17వ తేదీన ఉదయం 10 నుండి కళాశాలలో జరిగే డెమో మరియు ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.

Exit mobile version