సంగారెడ్డి ప్రతినిధి, జూలై 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): విద్యా, సామాజిక సేవా రంగాలలో సేవలకు గాను జాతీయ విశ్వ విఖ్యాత కీర్తి పురస్కారమైన మహా మయూర పురస్కారం 2024 ను సదాశివపేట మండల నిజాంపూర్ (కె) ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డాక్టర్.రామకృష్ణ అందుకున్నారు. త్యాగరాజు గాన సభ హైదరాబాదులో గో సంరక్షణ సమితి చైర్మన్ ఆకుల విద్యాసాగర్ గురూజీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డా.రామకృష్ణ ఈ జాతీయ పురస్కారంను దైవజ్ఞ శర్మ, హంస నందిని, రవిబాబు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు రామకృష్ణ మాట్లాడుతూ.. పురస్కారం అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, పురస్కారం ఇచ్చి గౌరవించిన విశ్వ విఖ్యాత కీర్తి పురస్కార కమిటీ, నిర్వాహకులకు కృతఙ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వన మూలికల నిపుణులు చీమల కోటేశ్వరి, దైవజ్ఞ శర్మ, పర్యావరణవేత్త రవిబాబు, విశ్వహిందూ పరిషత్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ గుప్తా, ప్రముఖ కవి, రచయిత దూడపాక.శ్రీధర్, రేవతి, పాల్గొన్నారు. జాతీయ పురస్కారం అందుకున్న డాక్టర్ రామకృష్ణను మండల విద్యాధికారి శంకర్, నోడల్ అధికారి సుధాకర్, నిజాంపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు రాజశ్రీ, పి.ఆర్.టి.యు సంగారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్ ,మదన్ గోపాల్, సదాశివపేట మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు నారాయణరావు, ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్ధులు, బంధుమిత్రులు, స్నేహితులు అభినందించారు.