తారా ప్రభుత్వ కళాశాల సంగారెడ్డిలో ఎన్ఎస్ఎస్ విభాగాలు, సామాజిక శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.ఎస్.ఎస్.రత్నప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఎటువంటి స్వార్థానికి లోబడక తాను అనుకుంటే ఏ లక్ష్యాన్నైనా సాధించగలుగుతుందని, యువత కలిగిన దేశం త్వరితంగా ఆర్థిక అభివృద్ధిని సాధిస్తుందని అన్నారు. అయితే యువతరం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యసాధనకు నిరంతరంగా పాటుపడినప్పుడే నూతన సమాజ నిర్మాణం ఏర్పడి భవిష్యత్తు తరాలకి ఆదర్శంగా ఉండగలుగుతున్నామని తెలిపారు. యువత సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణము సాధ్యమవుతుందని అన్నారు. ప్రపంచంలో యువతను అధికంగా కలిగిన దేశాలలో భారత దేశము మొదటి వరుసలో ఉంటుందని, యువత తనను అనుకుంటే ఏదైనా సాధించగలదు కాబట్టి ప్రపంచ అభివృద్ధిలో ప్రస్తుత కాలంలో యువత పాత్ర ఎంతో ఉందని ప్రిన్సిపల్ తెలిపారు. ప్రపంచంలో అన్ని రకాల రుగ్మతలను నిర్మూలించుటకు యువత సహకారాన్ని అందించాలని అన్నారు. ఏ దేశమైనా తాను త్వరితంగా అభివృద్ధిని సాధించాలంటే ఆ దేశానికి మానవ వనరులు చాలా ప్రధానమైనవి అని, మరి అట్టి మానవ పనులను పుష్కలంగా కలిగిన భారత దేశము ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే యువత పాత్ర ఎంతో అవసరమని తెలిపారు. ప్రపంచ దేశాలలో భారతదేశం ఒకటిగా ఉండాలంటే అందులో తప్పనిసరిగా సరియైన లక్ష్యాలు, మానవ, నైతిక విలువలు కలిగిన యువత కావాలని, ఆ లక్ష్యాలను మీరు ఏర్పరచుకుంటే భవిష్యత్తు తరాలు మనదేనని ప్రిన్సిపల్ రత్నప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జగదీశ్వర్, అధ్యాపక బృందం డాక్టర్ జోస్నా, డాక్టర్ మల్లిక, డాక్టర్ పి. పద్మ, డాక్టర్ అనురాధ, డాక్టర్ సదయ్య కుమార్, డాక్టర్ సుమతి, విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు.
యువతరం నవ సమాజ నిర్మాణం..ప్రిన్సిపల్ డాక్టర్ రత్న ప్రసాద్..
by admin admin
Published On: August 12, 2024 11:14 pm