*సంస్కృతిక జాతీయవాదమే అలంబనగా జనసంఘ్ ను స్థాపించిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి*
*ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు లో రెండు ప్రధానులు రెండు గుర్తులు ఉండకూడదు అని నినాదించిన శాంప్రసాద్ ముఖర్జీ*
*మహనీయుని గుర్తుగా మొక్కలు నాటిన బిజెపి కార్యకర్తలు*
*నాటిన మొక్కను రక్షించే బాధ్యత కార్యకర్తలదే*
*బిజెపి మండలాధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి*
*జమ్మికుంట ఇల్లందకుంట జులై 6 ప్రశ్న ఆయుధం*
భారతీయ సంస్కృతిక జాతీయవాదమే ఆలంబనగా ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహి చలేగా అని నినాదించిన భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకొని బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపుతో కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలలో బిజెపి శ్రేణులు మొక్కలు నాటారు అందులో మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో గల కస్తూరిబా బాలికల పాఠశాల ఆవరణలో బిజెపి మండల అధ్యక్షుడు రమణారెడ్డి కార్యకర్తలతో కలిసి వివిధ పండ్ల మొక్కలను పూల మొక్కలను నాటారు అనంతరం ఇల్లందకుంట మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ బిజెపి ఆవిర్భావ స్ఫూర్తిదాత సాంస్కృతిక జాతీయవాదమే ఆలంబనగా భారతీయ జనసంఘ్ ను స్థాపించిన క్రాంతదర్శి*ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిశాన్ నహి చలేగా* ” అని నినదించిన సాహసి…
తన జీవితాంతం హైందవ జాతీయవాదం కోసమే కృషి చేసిన తాపసి అని డా. శ్యామాప్రసాద్ ముఖర్జీ కొని ఆడారు వారికి శతకోటి నమస్సులు అర్పిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగిందని *ప్రతి కార్యకర్త నాటిన మొక్కను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కార్యకర్తలకు రమణారెడ్డి* సూచించారు. పచ్చని చెట్లు పర్యావరణానికి మెట్లు అని,ప్రతి ఒక్కరూ వారి బాధ్యతగా చెట్లను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. చెట్లు నీడనివ్వడమే కాకుండా పర్యావరణ కు రక్షణగా ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కో కన్వీనర్ తాళ్ల పాపిరెడ్డి, రావుల విజయ్ బాబు, నల్ల లింగారెడ్డి, బూత్ అధ్యక్షులు ఇంగ్లే రమేష్, తిప్పరబోయిన సమ్మయ్య, సానవేణి శ్రీనివాస్,మేకల మురళి,కోడం భరత్, చిలుక వీరాస్వామి, వంతడుపుల సారయ్య, బీస సారయ్య ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు