నూతన డీఎం అండ్ హెచ్ వోగా బాధ్యతలు స్వీకరించిన డా.వసంత్ రావు

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డా. వసంత్ రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ… జిల్లా ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సూచనలు, ఆదేశాలను అనుసరిస్తూ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలలో సేవల నాణ్యతను పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. వైద్య సిబ్బంది అహర్నిశలు పనిచేస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు సహకరించాలని కోరారు. ప్రజలకు వేగవంతమైన వైద్య సేవలను అందించడం తమ శాఖ ధ్యేయమని డా.వసంత్ రావు స్పష్టం చేశారు. 

Join WhatsApp

Join Now