డ్రైనేజీ, మంచినీళ్ల పైప్ లైన్ పునరుద్ధరించిన కార్యదర్శి

గ్రామపంచాయతీ పరిధిలో ముదిరాజ్ సంఘం నుండి సుభాష్ రోడ్డు వరకు గల డ్రైనేజీ లో పూడికతీత, మంచినీళ్ల యొక్క పైప్ లైన్ లీకేజీ పనులను గ్రామ కార్యదర్శి యాదగిరి సిబ్బందితో కలిసి దగ్గరుండి మరమ్మతులు చేయించడం జరిగిందని కాలనీవాసులు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా ఇక్కడి డ్రైనేజీ లో చెత్త చేరి ఇబ్బంది కావడం, పైప్ లైన్ లికేజీ కావడంతో నీరు సరిగా రాకపోవడంతో గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేయగా బుధవారం కార్యదర్శి వచ్చి వాటిని మరమ్మతులు చేయించడం జరిగిందని కాలనీవాసులు పేర్కొన్నారు.
Post Views: 9