తాగి నడిపితే జైలుకే..!

తాగి నడిపితే జైలుకే..!

అల్వాల్ ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక..

మద్యం సేవించి వాహనం నడిపిన వారికి జైలు శిక్ష..

జరిమానాలు వేసి చర్లపల్లి జైలుకు తరలింపు..

చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు..

ప్రశ్న ఆయుధం అల్వాల్, ఆగస్టు 5

మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదని అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే మద్యం మత్తులో డ్రైవింగ్‌పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

తాజాగా మేడ్చల్ జిల్లా పరిధిలో తాగి వాహనం నడిపిన ఎండి రియాజ్ (మేడ్చల్), హరినాయక్ (బోయిన్‌పల్లి) అనే వ్యక్తులకు నాలుగు రోజులు జైలు శిక్ష, టి. రాములు (కొంపల్లి) కు రెండు రోజుల జైలు శిక్ష విధించారు. వీరికి జరిమానా విధించి చర్లపల్లి జైలుకు తరలించారు.

ఇలాంటి కేసుల్లో ఎలాంటి సడలింపు లేదని, ప్రజల భద్రత కోసం కఠినంగా వ్యవహరిస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment