శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల నిర్మించిన తొట్టెలో నీరు తాగుతున్న పశువులు..

శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల నిర్మించిన తొట్టెలో నీరు తాగుతున్న పశువులు..

గ్రామాల్లో అందుబాటులోకి 12 వేల నీటి తొట్టెలు

నెలాఖరున మరో 3 వేలు పూర్తి

మండుతున్న ఎండల్లో

మూగజీవాలకు ఊరట

గ్రామాల్లో కొత్తగా నిర్మిస్తున్న నీటి తొట్టెలు మూగ జీవాల దాహార్తి తీర్చుతు న్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రంలో గత 20 రోజుల వ్యవధిలో 12 వేల తొట్టెల నిర్మాణం పూర్తి చేశారు. ఈ నెలాఖరులోగా మరో 3 వేల తొట్టెలు నిర్మించనున్నారు. వేసవి నేపథ్యంలో పశువులు, మేకలు, గొర్రెల తాగునీటికి ఇబ్బంది లేకుండా పశుసంవర్ధక శాఖ గుర్తించిన గ్రామాల్లో 15 వేల నీటి తొట్టెల నిర్మాణానికి ఈ నెల 1న రాష్ట్ర ప్రభుత్వం భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. అందులో ఇప్పటి వరకు దాదాపు 80% నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిని రోజూ నీటితో నింపే ఏర్పాట్లు చేశారు. దీంతో మండుతున్న ఎండల నుంచి మూగ జీవాలకు ఇవి ఊరటనిస్తున్నాయి. ఒక్కో నీటి తొట్టె నిర్మాణానికి రూ.45 వేల చొప్పున ఖర్చు చేస్తున్నామని, ఒక్కో దాంట్లో 3 వేల లీటర్ల నీరు నిల్వ చేసేలా డిజైన్ చేశామని, వీటి ద్వారా 15 లక్షల మూగ జీవాలకు రోజూ తాగునీటి వసతి అందుబాటు లోకి వస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధిశాఖ సంచాలకుడు కృష్ణతేజ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment