మా గ్రామానికి బస్సులు నడపండి…!!

మా గ్రామానికి బస్సులు నడపండి..

-గతంలో రోజుకు నాలుగు సార్లు వచ్చేవి 

నేడు ఒసారి వచ్చుడు కూడా కష్టమైపోతుంది

విద్యార్థులకు, మహిళలకు ఇబ్బంది కలుగుతుంది 

ఉప్పల్వాయి గ్రామస్తులు 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 18:

మా గ్రామానికి బస్సులు నడపండి అని రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామానికి చెందిన మహిళల, యువకులు బుధవారం కామారెడ్డి ఆర్ టి సి డిపో మేనేజర్ కార్యాలయాన్ని ముట్టడించిన అనంతరం రాస్తారోకో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ గ్రామానికి గతంలో రోజుకు నాలుగు సార్లు ఆర్టీసీ బస్సు వచ్చేదని నేడు ఒక్క పూట బస్సు రావడం గగనమైపోతుందన్నారు. దీంతో తమ గ్రామం నుండి విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు, మహిళలు ఇతరాతర పనుల కోసం ఇతర గ్రామాలకు వెళ్లాలంటే బస్సులు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. ఆర్టీసీ మేనేజర్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు వచ్చి ఉప్పల్వాయి గ్రామస్తులకు నచ్చజెప్పి ఆర్టీసీ మేనేజర్ అందుబాటులో లేకపోవడంతో ఆర్టీసీ సిఐని పిలిపించి ఆయనకు వినతి పత్రాన్ని అందజేయించారు. ఈ ధర్నాలో ఉప్పల్వాయి గ్రామ యువకులు మహిళలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now