అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
జమ్మికుంట ఆగస్ట్ 25 ప్రశ్న ఆయుధం
సోమవారం రోజున కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి గ్రామానికి చెందిన ఓర్సు లింగయ్య వయసు 56 సంవత్సరాలు అని ట్రాక్టర్ డ్రైవర్ రైతు కూలీలను ఎక్కించుకొని పొలం వద్ద దింపేసి తిరుగు ప్రయాణంలో వస్తుండగా అదుపుతప్పిన ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ స్పృహ కోల్పోగా హాస్పిటల్ కి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు ఓర్సు లింగయ్య వయసు 56 అను అతడు గండ్రపల్లి గ్రామానికి చెందిన జైదా రామకృష్ణ పొలంలో నాటు వేయుటకు కూలీలను ట్రాక్టర్ నెంబర్TS 02 UE 1140 గల దానిలో పొలానికి వెళ్లి కూలీలను దింపి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ చెరువు కట్టపై నుండి చెరువులోకి బోల్తా పడి డ్రైవర్ చనిపోవడం జరిగిందని డ్రైవర్ యొక్క కుమారుడైన ఓర్సు రాజకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జమ్మికుంట సిఐ రామకృష్ణ గౌడ్ తెలిపారు