Site icon PRASHNA AYUDHAM

డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మిద్దాం

డ్రగ్స్
Headlines :
  1. “డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి”
  2. “సంగారెడ్డి కళాశాలలో మత్తు పదార్థాలపై అవగాహన”
  3. “ప్రిన్సిపాల్, విద్యార్థుల ప్రణాళికలు: మత్తు పదార్థాలకు వ్యతిరేకం”
  4. “తెలంగాణలో యువతకు మత్తు పదార్థాల వల్ల నష్టం”

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహనను కల్పించుటకు డ్రగ్స్ కు సంబంధించిన పోస్టర్ ను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఎస్.ఎస్.రత్నప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. యువత వివిధ రకాలైన మత్తు పదార్థాలను స్వీకరిస్తూ, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వము డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించాలని, ఉద్దేశంతో వివిధ దశలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఆదేశాల మేరకు అధ్యాపక బృందంతో కలిసి ప్రిన్సిపాల్ గోడ పత్రికను ఆవిష్కరిస్తూ విద్యార్థులచే మత్తు పదార్థాలకు దూరంగా ఉండటమే కాకుండా సమాజంలో, ఏ రూపంలో మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం లభించినా.. అట్టి సమాచారాన్ని పోలీసులకు అందిస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యా శాఖ కార్యాలయ అధికారి అనురాధ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు వ్యక్తులను మానసికంగా, శారీరకంగా నాశనం చేస్తాయని, వీటిని సేకరించడం వల్ల అన్ని రకాలుగా వ్యక్తిజీవంగా మారుతాడని, కావున యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అదే విధంగా మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని స్నేహితులు, బంధువులు మొదలగు వారికి తెలియజేస్తూ అవగాహన కల్పించాలని అన్నారు.

ప్రధానంగా సంగారెడ్డి కేంద్రంగా గంజాయి, ఓపియం వంటి మత్తు పదార్థాలు కొనడం, అమ్మడం జరుగుతున్నదని వీటిని కొన్న అమ్మిన నేరమని విద్యార్థులు యువత ఈ మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని, వీటికి దూరంగా ఉండాలని తెలిపారు. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ 1908, కంట్రోల్ రూమ్ నంబర్ 8712671111 సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ జగదీశ్వర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ జోత్న, డాక్టర్ సదయ కుమార్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Exit mobile version