మత్తుకు యువత జీవితం చిత్తు:-మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు అవగాహన సదస్సు:-
ఈ రోజు మహాత్మ జ్యోతిబాపూలే బాలుర ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రామం:-చించోలి బి, మండలం సారంగాపూర్ యందు:-మాదొకద్రవ్యాల నిర్మూలనకై అవగాహన సదస్సు:-
విద్యార్థిని విద్యార్థులకు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ ఇన్చార్జి చైర్మన్ డాక్టర్ సాప పండరి మాట్లాడుతూ యువత మత్తు పానీయాలకు బానిసలు అవుతున్నారని, మన పైన పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేస్తున్నారని, సిగరెట్, గంజాయి,గుట్కా, తంబాకు, వైన్, కొకైన్, వైట్నర్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని”””ఆరోగ్యమే మహాభాగ్యమని””””లేనిపోని వ్యసనాలకు ఆసక్తి చూపి ఆత్మహత్యలకు కారకులవుతున్నారని, తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుచుతున్నారని మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో SJWHRC ప్రతినిధులు నిర్మల్ జిల్లా డైరెక్టర్ ఠాగూర్ దత్తు సింగ్, నిర్మల్ జిల్లా మహిళా విభాగం చైర్మన్ రాపర్తి అనుష, నిర్మల్ మండలం చైర్మన్ పోలీస్ భీమేష్, నిర్మల్ మండలం ప్రెసిడెంట్ సబ్బని సంజీవ్, బైంసా మండలం మాటేగా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లక్ష్మణరావు యువకులు పాల్గొన్నారు