*హుజురాబాద్ పట్టణ సి.ఐ చేతుల మీదుగా “SAY NO TO DRUGS” పోస్టర్ ఆవిష్కరణ- యువజన కాంగ్రెస్*
జమ్మికుంట
మాదకద్రవ్యాల భారిన పడి యువత తప్పుదోవ పడుతుందని యువజన కాంగ్రెస్ నాయకులు అన్నారు.”SAY NO TO DRUGS” పేరిట యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ పట్టణ సీఐ తిరుమల్ గౌడ్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లలు ఉన్నత శిఖరాలకు చేసుకోవాలనే ధ్యేయంతో కాయకష్టం చేసి ఉన్నత చదువులు చదివిస్తుంటే కొంతమంది యువత మాత్రం మత్తుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని డ్రగ్స్ మత్తులో యువకులు ప్రమాదాల భారిన పడుతున్నారని డ్రగ్స్ తీసుకోవడం వలన నేరాలకు పాల్పడుతూ ఉన్నతమైన భవిష్యత్ ను చేతులారా పాడు చేసుకుంటున్నారని అన్నారు యువకులు డ్రగ్స్ నిర్మూలించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు సందమల్ల నరేష్ టేకుల శ్రావణ్ బి.ఆర్ గౌడ్ జంగ అనిల్ కుమార్ లంకదాసరి గంగరాజు చల్లూరి విష్ణువర్ధన్ ముక్క రవితేజ కొండ్ర నాగరాజు కుక్కముడి రాజేష్ బీట్ల సాయి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.