“7 కేసులు నమోదు: మద్యం సేవించి వాహనాలు నడిపిన వారి పట్ల చర్య”
కామారెడ్డి టౌన్ ప్రశ్న ఆయుధం నవంబర్ 03
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసులు సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 7కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ ఎస్ఐ. సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఎస్ఐ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపి జీవితాలు ఛిద్రం చేసుకోవద్దని, మద్యం సేవించి వాహనాలు నడిపి ఎదుటివారికి నష్టం జరుగుతుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ను సీరియస్ గా తీసుకొని తనిఖీలు ముమ్మరం చేశామన్నారు.