డ్రై డే ఫ్రైడే పాటించి డెంగు వ్యాధిని నివారించాలి

*డ్రై డే ఫ్రైడే పాటించి డెంగు వ్యాధిని నివారించాలి*

*జాతీయ డెంగు వ్యాధి దినోత్సవం*

*డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు*

*ఇల్లందకుంట మే 16 ప్రశ్న ఆయుధం*

జాతీయ డెంగ్యూ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రోజున హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇల్లందకుంట ను సందర్శించి జాతీయ డెంగ్యూ వ్యాధి దినోత్సవం లో పాల్గొని మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత గురించి వివరిస్తూ డ్రైడే ఫ్రైడే పాటించాలని దోమల నివారణకు సాధ్యమైనటువంటి అన్ని విధాల పద్ధతులు అవలివించాలని దోమల వలన వచ్చే వ్యాధులను నివారించవచ్చని ముఖ్యంగా డెంగ్యూ జ్వరం నీరు నిల్వ ఉన్న ప్రాంతంలోనే డెంగు దోమ లార్వా దోమగా మారుతుందని తద్వారా అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో డెంగ్యూ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని వర్షాకాలంలో తమ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలువ లేకుండా ఉంచుకోవాలని పూల కుండీలు కొబ్బరి బొండాలు పాడైపోయిన కూలర్లు వాటిలో డెంగ్యూ దోమలు తయారయ్యే అవకాశం ఉంటుందని ఎక్కడ నీరు నిలవ లేకుండా పొడి వాతావరణాన్ని పరిసప్రాంతాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు దోమ పుట్టకూడదు దోమ కు ట్టకూడదు అనే నినాదంతో అందరం ముందుకు వెళ్లాలని సూచించారు సమాజంలో ప్రతి ఒక్కరూ డెంగ్యూ పై అవగాహన ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ తులసీదాస్ హెల్త్ ఎడ్యుకేటర్ ప్రతాప్ సి హెచ్ ఓ శ్యామల. ల్యాబ్ టెక్నీషియన్ సంజీవ్ సూపర్వైజర్లు శ్రీనివాస్, విజయ శ్రీ బాల శోరి ఆశ ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now