కొయ్యగుట్ట లో డ్రైడే -ఫ్రైడే కార్యక్రమం
ప్రజలకు అవగాహనా కల్పించిన మున్సిపల్ కమీషనర్ శ్రీహరి రాజు…
ప్రశ్న ఆయుధం 04 జూలై (బాన్సువాడ ప్రతినిధి)
బాన్సువాడ పట్టణంలోని మూడో వార్డు కోయగుట్టలో 100 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు డ్రైడే -ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.పలు వీధులలో తిరుగుతూ యాంటీ లార్వా స్ప్రింయింగ్ చేశారు. నీరు నిల్వ ఉండే ప్రదేశాలలో ఆయిల్ బాల్స్ వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది సతీష్ తదితరులు పాల్గొన్నారు.