Site icon PRASHNA AYUDHAM

మార్కెట్ యార్డు లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డి.ఎస్.చౌహాన్..

కొనుగోలు
Headlines in Telugu
  1. డి.ఎస్.చౌహాన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు, రైతులకు కీలక సూచనలు
  2. తేమశాతం తగ్గింపు ద్వారా ధాన్యానికి బోనస్ అందించే విధానంపై చర్చ
  3. రైతులకు నాణ్యతగా ఆరబెట్టిన ధాన్యం తీసుకురావాలని పౌర సరఫరాల శాఖ ఆదేశాలు 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 07:

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకవచ్చే ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకురావాలని పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్.చౌహాన్ అన్నారు. గురువారం రాత్రి బిక్నూరు వ్యవసాయ మార్కెట్ యార్డు లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. తొలుత యార్డులో ఆర బెట్టిన ధాన్యం తేమశాతాన్ని కొలువగా 40 కి పైగా ఉండడం ఆయన గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ బియ్యం మంచి నాణ్యత కలిగి ఉంటాయని, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కర్నాటక మొదలగు రాష్ట్రాలకు తెలంగాణ నుండి రవాణా అవుతాయని తెలిపారు. ధాన్యం పచ్చి పంటను కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకరావద్ధని, ఆర బెట్టిన వరి ధాన్యాన్ని తీసుకురావాలని రైతులను కోరారు. రైతులు ఎలాంటి అపోహాలు, అనుమానాలకు తావివ్వకుండా వ్యవసాయ అధికారులు చెప్పిన ప్రకారం చేయాలని సూచించారు. సన్నావడ్లు తొందరగా కోస్తే ధాన్యం నల్లపడుతుందని తెలిపారు. ఆర బెట్టిన సన్న వడ్లుకు క్వింటాలుకు 500 రూపాయల చొప్పున ప్రభుత్వం బొనస్ ఇస్తుందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్ ఎంట్రీ చేసి, రైస్ మిల్లులకు తరలించి రెండు, మూడు రోజుల్లో రైతులకు చెల్లింపులు జరుగుతాయని, మరో రెండు రోజుల్లో బోనస్ చెల్లింపులు చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ, సాధారణంగా ఈ ప్రాంతంలో పండే సన్నరకం వడ్లు పండించాలని, మొత్తం 33 రకాల సన్న వడ్లు పండించవచ్చని తెలిపారు. సన్న వడ్లు సాగుపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. సన్న వడ్లు వివరాలు ప్రతీ కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేయాలని వ్యవసాయ అధికారులకు తెలిపారు. పచ్చి వడ్లు కోతలు జరిపే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అవసరమైన గోదాములను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ వి.విక్టర్, ఆర్డీఓ రంగనాథ్ రావు, మండల ప్రత్యేక అధికారిని, పౌరసరఫరాల అధికారులు, మార్కెటింగ్, తదితరులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు, పాల్గొన్నారు.
Exit mobile version