Site icon PRASHNA AYUDHAM

బక్రీద్ పండుగ సందర్భంగా డిఎస్పి అబ్దుల్ రెహమాన్ కు సన్మానం

IMG 20250608 WA0149

సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషాకు

డాక్టర్ మద్దెల శివకుమార్
ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 8 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
కొత్తగూడెం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్ అబ్దుల్ రెహమాన్ కు, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కె షాబీర్ పాషా కు
బక్రీద్ పండగ పర్వదినం సందర్భంగా శాలువలతో సన్మానించి స్వీట్లు పంచిన భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ శనివారం రాత్రి వారి చాంబర్లో కలుసుకొని, పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించినారు డీఎస్పీ రహమాన్ కి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, వృత్తిపరమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాలని కోరారు.పవిత్ర బక్రీదు పర్వదినం సందర్భంగా సిపిఐ జిల్లా పార్టీ సెక్రటరీ, పేదలపాలిటీ పెన్నిధి, విద్యార్థి దశ నుండే ఉద్యమాలలో పాల్గొని, ప్రజా నాయకుడిగా అంచలంచలుగా ఎదిగి, అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొని, ఈనాడు కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్న, నిత్య కృషి వరుడు నిరంతర సేవా తత్పరుడు ఆదర్శ అభ్యుదయాల వాది కొత్తగూడెంశాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు కి, వెన్నంటి ఉండి వారి అభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తూ,అందరికీ ఆమోదయోగ్యుడుగా ఉన్న , సిపిఐ పార్టీ సెక్రటరీ ఎస్ కే సాబీర్ పాషా ని ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించి స్వీట్లు పంచి అభినందించారు.

Exit mobile version