*వెనకబడిన వర్గాల నుండి ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన డిఎస్పి*
ఫిబ్రవరి 7 కరీంనగర్
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా
విఆర్ఎస్ డిఎస్పి మధనం గంగాధర్ కరీంనగర్ లో భారీ సంఖ్యలో మద్దతుదారులు పట్టభద్రులు తరలిరాగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి గంగాధర్ మాట్లాడుతూ నిరుద్యోగుల పట్టభద్రుల గొంతు శాసనమండలిలో వినిపిస్తానని తన గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. మధనం గంగాధర్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తన గెలుపుకు కృషి చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల నుండి మధనం గంగాధర్ మద్దతు దారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.