సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా చిత్రపటానికి డీఎస్పీ సత్తయ్య గౌడ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఆర్.ఐ రామారావు, సిబ్బంది పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు. సత్యసాయి బాబా సేవా భావం, సానుభూతి, మానవతా విలువలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఆర్.ఐ రామారావు, కార్యాలయ సిబ్బంది, ఆర్మూడ్ రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి బాబాకు నివాళులు అర్పించిన డీఎస్పీ సత్తయ్యగౌడ్
Published On: November 23, 2025 7:45 pm