నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు – దుబ్బాక ఏడిఏ మల్లయ్య.

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు

– దుబ్బాక ఏడిఏ మల్లయ్య.

దుబ్బాక ప్రతినిధి, డిసెంబర్12

ఫర్టిలైజర్ దుకాణ యజమానులు, డీలర్లు ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులను ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక రేట్లకు విక్రయిస్తే చర్యలు తప్పవని దుబ్బాక ఏడిఏ మల్లయ్య అన్నారు. గురువారం దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ లో ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫర్టిలైజర్ దుకాణాలకు సంబంధించిన లైసెన్సులు, ధరల పట్టికనుఅందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు.నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అనంతరం గొడుగుపల్లి గ్రామంలో రైతుల వ్యవసాయ పొలాలను పరిశీలించారు. వరి కోతల అనంతరం కొయ్యలను కాల్చితే భూసారం దెబ్బతింటుందని పాటు సూక్ష్మజీవులు నశిస్తాయని అన్నారు. భూమిలో ఉండే నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలు కాల్చడం వల్ల గాలిలో ఆవిరై పోతాయన్నారు. అలాగే నారుమడులను పరిశీలించి ప్రస్తుతం చలికాలంలో వాటిని రక్షించుకోవడానికి సస్యరక్షణ చర్యలను చేపట్టాలని పరు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్, ఏఈవోలు సంతోష్ కుమార్, బాబురాజు, ఫర్టిలైజర్ డీలర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment