మెదక్/దుబ్బాక, జనవరి 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): రైతు భరోసా పథకం పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. సోమవారం దుబ్బాకలో ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో రైతు ధర్నా, ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు రైతులకు రూ. 15వేలు ఇస్తామని భరోసా ఇచ్చిందని, కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.12వేలకి తగ్గించడంపై ఏమిటని ప్రశ్నించారు. రైతులను నమ్మించి, ఎన్నికల్లో విజయం సాధించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. రైతుల హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రైతులు మరింతగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. అంతే కాకుండా రైతుల సమస్యలు, వారి భవిష్యత్తుపై కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా వ్యవహరించడం లేదని, రైతు భరోసా 15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రైతు ధర్నాకు నార్సింగి నుంచి నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కిష్టారెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బాబు, నార్సింగి మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేశంగౌడ్, నాయకులు యోగి, గొండ స్వామి, జగన్ రెడ్డి, ఓం ప్రకాష్, బాషానాయక్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
Updated On: January 6, 2025 2:22 pm
