జిల్లాలోని రైస్ మిల్లుల యజమానులు నిర్ణీత గడువు సెప్టెంబర్ లోగా బియ్యం సరఫరా చేయాలి..
-జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 11:
జిల్లాలోని రైస్ మిల్లుల యజమానులు నిర్ణీత గడువు సెప్టెంబర్ 30, 2024లోగా బియ్యం సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. బుధవారం రోజున తన ఛాంబర్ లో పౌరసరఫరాల అధికారులతో బియ్యం సరఫరా
ఖరీఫ్ 2023-2024 సంబంధించి రైస్ మిల్లు యజమానులు పెట్టవలసిన దాన్యం సరఫరా వేగవంతం పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తమ పరిధిలోని రైస్ మిల్లులు తనిఖీ చేసి బియ్యం ఎఫ్
సి. ఐ./ పౌరసరఫరాల శాఖ కు సరఫరా చేయాలని ఆదేశించారు
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌరసరఫరాల సహాయ అధికారి కే వై ఎల్ నరసింహారావు, టాస్క్ ఫోర్స్ ఉప తాసిల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.