వంతెన కూలిపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు

దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామంలో ప్రతినిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ఉన్న ఒక వంతెన అకస్మాత్తుగా సగం కూలిపోవడంతో అప్పుడు సంబంధిత అధికారులు ప్రయాణికులకు ఇబ్బంది జరగకుండా పక్కనుంచి డైవర్షన్ రోడ్డు వేశారు ఆ రోడ్డు వేయడం వల్ల ప్రయాణికులు అటుగా ప్రయాణిస్తున్నారు. సుమారుగా ప్రతిరోజు వందకు పైగా ఇసుక లారీల రోడ్డుపై వెళ్తుండటంతో నామమాత్రంగా వేసిన రోడ్డు కనుక ఆ రోడ్డు అంత గుంతల మయంగా మారటమే కాకుండా విపరీతమైన దుమ్ము దూళీ లెగిసి ఆ లారీలు వెనకాల ప్రయాణించే ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఆటో మీద వెళ్లే వాళ్లే కాకుండా టూ వీలర్ మీద వెళ్లే ప్రయాణికులు కూడా లారీల వల్ల లెగిసే దుమ్ము వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా రాత్రి వేళల్లో ఆ దుమ్ము లేచి రోడ్డు కనిపించకుండా ఇబ్బందులకు గురవుతున్నారు. భద్రాచలం నుంచి వెళ్లే కొంతమంది లారీలు వారు రిపేర్ అయిన వంతెన మీద నుంచి విపరీతమైన స్పీడ్ తో వెళుతున్నారు. దానివల్ల వంతెన పూర్తిగా కూలిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆ నామమాత్రంగా వేసిన ఆ డైవర్షన్ రోడ్డు వల్ల వాతావరణంలోకి లెగిసే దుమ్మి ధూళి వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకొని అటువంటి సమస్యలు పునరావడం కాకుండా చూడగలరని ప్రయాణికులు స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

Join WhatsApp

Join Now