కామారెడ్డి లో భారీ వర్షం వల్ల వచ్చిన వరదల వల్ల కాలనీవాసుల భయభ్రాంతులు

* కామారెడ్డి లో భారీ వర్షం వల్ల కురువడం తో వరదల వల్ల కాలనీవాసుల భయభ్రాంతులు…

– రాత్రి 10 గంటలకు ప్రారంభమైన వర్షం, రెండు గంటల్లోనే భారీ స్థాయికి చేరుకోవడం.
– డిగ్రీ కాలేజ్ నుండి వచ్చిన నీరు, జూనియర్ కాలేజ్ వెనుక చాపల చెరువు నిండిపోవడం.
– కాలేజీ కాంపౌండ్ కూలిపోవడం, వరదలు ఇళ్లలోకి ప్రవేశించడం.
– బైకులు వరదలో కొట్టుకుపోయి, మట్టిలో కప్పుకపోవడం, కార్లలోకి నీళ్ళు రావడం.
– వరద నీరు, మట్టి ఇంట్లోకి చేరి, కిచెన్, బెడ్రూంలను దెబ్బతీయడం.
– కాలనీవాసుల బైయోనందలకు , కేరళ వరదలను గుర్తు తెచ్చుకున్నారు .
– డ్రైనేజీ వ్యవస్థపై ప్రజల అసంతృప్తి, మున్సిపల్ అధికారులపై తీవ్ర విమర్శలు.

 

రాత్రి 10 గంటలకు కామారెడ్డి లో చిన్ని వర్షం మొదలై, రెండు గంటల్లోనే అతి భారీ వర్షానికి దారితీసింది. డిగ్రీ కాలేజ్ నుండి వచ్చే నీరు, జూనియర్ కాలేజ్ వెనుక ఉన్న చేపల చెరువు నిండిపోయింది. వర్షం ఒత్తిడికి కాలేజీ కాంపౌండ్ కూలిపోయింది, అందువల్ల భారీగా వరద నీరు ఇళ్లలోకి చేరి. వరద ప్రవాహంలో బైకులు కొట్టుకుపోయి, మట్టిలో కప్పుకపోయాయి, అలాగే కార్లలోకి కూడా నీళ్ళు ప్రవేశించాయి. ఈ వరద నీరు తో పాటు, మట్టితో కూడిన నీరు కూడా ఇళ్లలోకి చొచ్చుకుపోయి, కిచెన్, బెడ్రూంలను నాశనం చేసింది.

కాలనీవాసులు ఈ వరదల వల్ల తీవ్రమైన భయభ్రాంతులకు గురయ్యారు. వారు గతంలో కేరళలో జరిగిన ఘోర వరదలను గుర్తు తెచ్చుకొని, ఇల్లు శుభ్రం చేసుకుంటూ తెల్లవారుజాములకు మట్టిని ఎత్తిపోస్తూ, ఆ కష్టాలను అనుభవిస్తున్నారు.

ఇప్పటివరకు కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను సరైన ప్రణాళిక లేకుండా ఏర్పాటు చేయడం వల్ల ఈ సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు అంటున్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పుడు అయినా ఈ డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి పెట్టి, ముందు ముందు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now