గత పాలకుల నిర్లక్ష్యం వల్లే నా భూమి కబ్జాకు గురైంది -2002 లో కొన్న భూమి కబ్జా కు గురైంది.

గత పాలకుల నిర్లక్ష్యం వల్లే నా భూమి కబ్జాకు గురైంది -2002 లో కొన్న భూమి కబ్జా కు గురైంది.

నిజామాబాద్, జనవరి 17

గత పాలకుల నిర్లక్ష్యం వల్లే నా భూమి కబ్జాకు గురైంది -2002 లో కొన్న భూమి కబ్జా కు గురైంది.

భూకబ్జా దారుల నుండి తన భూమిని తనకు ఇప్పించి న్యాయం చేయాలనీ నిజామాబాద్ నగరవాసి అదే ప్రవీణ్ వేడుకొన్నారు. శుక్రవారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ తన భూమికి సంబందించిన లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయని, కొందరు నకిలీ పట్టాలు సృష్టించి, అట్రాసిటీ కేసులు పెడుతమంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రాజకీయంగా ఎదిగిన వ్యక్తులు ఏ పార్టీ అధికారంలో అంటే ఆ పార్టీ కి కొమ్ము కాస్తూ కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు.ఎం అర్ ఓ కార్యాలయంలో, మున్సిపల్ లో కొంత మంది అధికారులు అమ్ముడు పోవడం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్నారు.

కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు నకిలీ పట్టాలు సృష్టించి ప్లాట్ కబ్జా చేశారని . అమర్ సింగ్ అనే వ్యక్తి వీర్ రాజ్ పేరిట నకిలీ పట్టా సృష్టించి 2018 లో కబ్జా చేశారని, ఇంజక్షన్ ఆర్డర్ రావడం వల్ల ఇన్ని రోజులు నేను బయట పెట్టలేక పోయానన్నారు.. కొందరు కలసి మూటలుగా ఏర్పడి కబ్జా లు చేస్తున్నారని . బీసీ కమిషన్ వచ్చినపుడు వారికి బీసీ అట్రాసిటీ పెట్టాలని వినతి పత్రం సమర్పించామని అన్నారు. ఎం అర్ ఓ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద అడిగితే పత్రాలు కాలిపోయినట్లు ఇస్తున్నారని అన్నారు.ఈ విషయమై 2023 లో సీపీ కి పిర్యాదు చేశామన్నారు.కేసు ఉండగానే మున్సిపల్ అధికారులు లంచాలు తీసుకొని ఇల్లుకు పర్మిషన్ ఇచ్చారన్నారు.వీర్ రాజ్ ఇప్పుడు బ్రతికి లేడని ఆయన కుమారునితో కలిసి తాను రూరల్ సీఐ కు పిర్యాదు చేశామని తమకు ఆ భూమితో ఎలాంటి సంబంధం లేదని చెప్పడన్నారు. కబ్జాదారుల చెర నుండి నా భూమిని నాకు ఇప్పించి న్యాయం చేయాలని పత్రిక ముఖంగా కోరుతున్నానన్నారు.

Join WhatsApp

Join Now