కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు…

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు.

ముత్యాలపాడు గ్రామ పంచాయతీలో గత 15 రోజులు వర్షానికి డబుల్ బెడ్రూం ఇల్లు నీరు పారుతున్నాయి

సిపిఐ ఎంఎల్ ( మాస్ లైన్) ప్రజపందా నాయకులు డిమాండ్

ములకలపల్లి (న్యూస్ ) జూలై 21 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామం పంచాయతీలు గల గత బి ఆర్ఎస్. ప్రభుత్వం ఇచ్చిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు 15 రోజులు వర్షానికి నీరులై పారుతున్నాయి. దీనిపై ప్రజలు చాలా ఇబ్బందిగా ఉందని మాకు పడుకోవడానికి పరిస్థితి లేదు వంట ఉండే పరిస్థితి లేదు రోజు నిద్రలేక నిలబడి పరిస్థితి వచ్చింది అలానే గోడలలో కూడా తాకితే కరెంట్ షాక్ కూడా వస్తుంది. మేము ఏం చేయాల నిద్రాహారాలు లేక నీళ్లలో చెలగాటమాలినట్టు ఉంది దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి మాకిచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాం. సిపిఐ ఎంఎల్ (మాస్ లైన్) ప్రజాపంద ముత్యాలంపాడు గ్రామ పంచాయితీ కార్యదర్శి ఈసం అశోక్ మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన ఇళ్లల్లో ఉండే పరిస్థితి లేదు దీనిపై 15 రోజులు వర్షానికి ఇల్లు నీరులై పారుతున్నాయి దీని స్పందించిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద నాయకులు దీన్ని ఖండించి. ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇళ్లపై దృష్టి పెట్టి ప్రభుత్వం మళ్లీ వర్షానికి కురుస్తున్న ఇళ్లను పరీక్షించి తగు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్( మాస్ లైన్) ప్రజాపంద ముత్యాలంపాడు గ్రామ కమిటీ నాయకులు ఈసం బాబురావు. ఈ సం శివ. కారం బాలరాజు. ఈసం బాలరాజు. సడియం రామకృష్ణ. తాటి చిరంజీవి. పెనుబల్లి చిన్న. ఈసం కిరణ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now