వర్షం వస్తె దారి లేని ఊరు,నెల రోజులు వరకు రాకపోకల బందు..
దమ్మపేట కి కుత వేటు దూరంలో ఉన్న రాజు పేట గ్రామమంకి ఇ పరిస్థితి.
రైతులు పంట పొలాలకు-మందు కట్టలు తీసుకెళ్లాలన్నా,ఆ ఊరికి కులొల్లు రావాలన్న ఇబ్బంది పడుతున్న ప్రజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కలగండి పంచాయతీలో ఉన్నటువంటి రాజుపేట అనే గ్రామం గత కొంతకాలం నుంచి రహదారి లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు,మండలానికి కుతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామానికి ఈ దుస్థితి ఏర్పడింది,ఓట్ల కోసం ఉరుకుల,పరుగులు పెట్టే అధికారులుకు ఆ గ్రామ ప్రజల గోడు పట్టదా,చెరువులో నుంచి రహదారి తీయడం వల్ల చెరువు నిండితే నడుము లోతు పైనే నీళ్లు రహదారి పైకి వస్తున్నాయి,గ్రామ ప్రజలకు రాకపోకలకు 30 నుంచి 40 రోజులు ఇబ్బంది ఏర్పడుతుంది,నిత్యవసర వస్తువులు గాని వైద్య సదుపాయాలు గాని వెళ్లాలంటే తోటలలో నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తున్నది, పంట పొలాలకు మందు కట్టలు వేసుకోవాలన్న,కులోల్లు పొలాలకు రావాలన్న ఇబ్బంది పడుతున్నారు,అధికారులు స్పందించి ఆ గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని ఆదివాసి నాయుకులు తంబళ్ల రవి కోరారు.