గ్రామపంచాయతీ కార్మికులు వినతి పత్రం అందజేత
ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 16 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
తెలంగాణ రాష్ట్రంలోని 12,790 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 60,000 మంది ఉద్యోగులు, కార్మికులు తమకు జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఎంపీఓ తిరుపతిరెడ్డి కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 12,790 గ్రామ పంచాయితీల్లో సుమారు 60,000 మంది గ్రామ పంచాయితీ ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, డంపింగ్ యార్డ్స్, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డ్రైవర్లు, ఆఫీసు నిర్వహణ తదితర పనుల్లో వివిధ కేటగిరీల వారీగా పనులు చేస్తూన్నాం. గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ప్రజలకు సేవలందిస్తున్నారు. 2018 సం||లో గత రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.51ని విడుదల చేసి సిబ్బంది వేతనాలను రూ.8,500/-లకు పెంచింది. వేతనాలు పెంచుతూనే పంచాయతీ కార్మికుల మెడకు ఉరితాళ్ళను బిగిస్తూ మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. మల్టీపర్పస్ వర్కర్లుగా మార్చిన తరువాత ఎవరైనా ఏ పనినైనా చేయాలనే నిబంధన పెట్టి కార్మికులపై ఒత్తిడి పెంచి బలవంతంగా పనులు చేయించడంతో ఇతర పనులపై వారికి నైపుణ్యం లేక అనేక జిల్లాలలో ప్రమాదాలు జరిగి కార్మికులు మరణిస్తున్నారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడం లేదు. దీంతో ఆ కార్మికుల కుటుంబాలను ఆదుకోనే దిక్కులేక రోడ్డున పడ్డాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 500 మంది జనాభాకు ఒక కార్మికుడు చొప్పున 36,500 మందిని ఖరారు. చేసి ఆన్లైన్లో పేర్లను పొందుపర్చారు. గడిచిన 15 సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీల విస్తీర్ణంతో పాటు గ్రామాలలో పారిశుద్ధ్య అవసరాలు పెరగడంతో సుమారుగా 13,500 మందిని అదనంగా నియమించారు. అదనంగా నియమించిన కార్మికుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో వేతనాలు నిర్ణయించిన దాని కంటే తక్కువ చెల్లిస్తున్నారు. పాత కార్మికులు చెల్లిస్తున్న వేతనాలను అదనంగా నియమించిన కార్మికులకు కలిపి పంపిణీ చేస్తున్నారు. ఫలితంగా అతి తక్కువగా వేతనాలు అందుతున్నాయి. 2023 సం||లో ప్రభుత్వ అధికారులు సేకరించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 52 వేల మంది పంచాయితీ సిబ్బంది ఉన్నారని లెక్కలలో ప్రకటిస్తూ ప్రతి కార్మికుడికి రూ.5,00,000/-ల ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ ప్రభుత్వం 36,500 మందికే గ్రాంట్ ఇస్తున్నది. ప్రస్తుతం పనిచేసే వారందరినీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వేతనాలు చెల్లించకపోవడం సరైనది కాదు.
చెల్లిస్తున్నదే అతి తక్కువ వేతనాలు. అవి కూడా 5-6 నెలలుగా చెల్లించకపోవడం వేతనాలు సరైన సమయంలో అందక కుటుంబాల పోషణ భారమై కుటుంబ అవసరాల కోసం అప్పులు చేసి బతకాల్సిన పరిస్థితి పంచాయతీ సిబ్బందికి ఏర్పడింది. బకాయి వేతనాలు చెల్లించాలని జెఏసి ఆందోళనలు చేసిన తర్వాత కార్మికుల బకాయి వేతనాల కోసం ప్రభుత్వం బడ్జెట్ కేటాయించినప్పటికీ పంచాయతీలలో కార్మికులకు అందలేదు. బకాయి వేతనాల సమస్య తీవ్రంగా ఉన్నది కావున పంచాయతీ ఉద్యోగ, కార్మికుల సేవలను గుర్తించాలని, పంచాయితీ సిబ్బందినందరినీ పర్మినెంట్ చేయాలని, జీఓ నెం. 51ని సవరించాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, కేటగిరీల వారీగా వేతనాలను పెంచాలని, కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని, బకాయి వేతనాల చెల్లింపులలో జరుగుతున్న జాప్యంపై చర్యలు తీసుకొని వేతనాల చెల్లింపుకు ప్రభుత్వమే బడ్జెట్ కేటాయించి నేరుగా కార్మికుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లో వేతనాలు జమ చేయాలని తమరికి విజ్ఞప్తి చేస్తున్నాము.
డిమాండ్స్ గ్రామ పంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించాలి. వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలి.2వ పిఆర్సి పరిధిలోకి గ్రామ పంచాయితీ సిబ్బందిని తీసుకురావాలి. జీఓ నెం:60 ప్రకారం వేతనాలు కేటగిరీల వారీగా చెల్లించాలి.జీవో నెం.51ని సవరించాలి. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి. పాత కేటగిరీలన్నింటినీ కొనసాగించాలి. కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలి. అర్హులైన సిబ్బందికి ప్రమోషన్ న్లు కల్పించాలి.పంచాయతీ సిబ్బందినందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ రూ. 5 లక్షలు చెల్లించాలి. ఇన్సూరెన్స్, ఇఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి.పంచాయతీ సిబ్బందినందరినీ పర్మినెంట్ చేయాలి. వేతనాలు పెంచాలి.
ఆన్లైన్లో నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేసి నేరుగా వారికి కూడా వేతనాలు చెల్లించాలి. పంచాయతీల అవసరాల ప్రతిపాధికన కార్మికుల సంఖ్యను పెంచాలి.కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలి,చనిపోయిన, అనారోగ్యానికి గురైన కార్మికుల కుటుంబాల సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది సిఐటియు జిల్లా అధ్యక్షుడు తదితరులు పాల్గొని వినతి పత్రం అందజేశారు