దుర్గాదేవి శరన్నవరాత్రీ ఉత్సవాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.
— జిల్లా ఎస్పీ యం. రాజేశ్ చంద్ర, ఐపీఎస్
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 21
కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారులు దుర్గాదేవి శరన్నవరాత్రీ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు కఠిన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా దసరా మరియు నవరాత్రి, ఉత్సవాలను జరుపుకునేలా పోలీస్ బందోబస్తు, నిఘా ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ యం. రాజేశ్ చంద్ర, ఐపీఎస్ వెల్లడించారు.
ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి
ఉత్సవాల్లో భద్రతా చర్యలు సమర్థవంతంగా అమలు చేయడానికి, ప్రతి మండప నిర్వాహకుడు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెబ్‌సైట్ (https://policeportal.tspolice.gov.in/) ద్వారా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ సూచించారు.
మండప నిర్వాహకులు తప్పనిసరిగా పాటించవలసిన నియమనిబంధనలు:
1. మండపాల పూర్తి బాధ్యత నిర్వాహకులదే.
2. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి.
3. నిర్దేశిత సమయానికి శోభాయాత్ర, విగ్రహ నిమజ్జనం పూర్తి చేయాలి.
4. మండపాలు ప్రజా రవాణా, ఎమర్జెన్సీ వాహనాలకు ఆటంకం కలిగించకూడదు.
5. సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరి.
6. మండప కమిటీ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు స్పష్టంగా ప్రదర్శించాలి.
7. రాత్రి 10 గంటల తరువాత స్పీకర్ల వాడకం నిషేధం, DJలు పూర్తిగా నిషేధం.
8. 24 గంటలపాటు వాలంటీర్ హాజరుగా ఉండాలి.
9. భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేయాలి.
10. అగ్ని ప్రమాద నివారణకు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు/నీటి బకెట్లు తప్పనిసరి.
11. మద్యం సేవించడం, పేకాట, అసభ్య నృత్యాలు, ఇతర మతాలను కించపరిచే ప్రసంగాలు పూర్తిగా నిషేధం.
12. ప్రతి మండపంలో తనిఖీ పుస్తకం ఉంచాలి.
13. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనపడితే వెంటనే Dial 100 కు సమాచారం ఇవ్వాలి.
14. దీపాలను ఇసుక/బియ్యం పై ఉంచి అగ్ని ప్రమాదాలు నివారించాలి.
15. ఎలక్ట్రిఫికేషన్ నిపుణుల ద్వారా చేయించుకుని, షార్ట్ సర్క్యూట్లను నివారించాలి.
16. గాలి కారణంగా అగ్ని ప్రమాదం జరగకుండా అలంకరణలో జాగ్రత్తలు తీసుకోవాలి.
17. విగ్రహాల రవాణాలో విద్యుత్ తీగలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రజలకు సూచనలు,
సామాజిక మాధ్యమాలలో వచ్చే వదంతులను నమ్మరాదు.
ఎటువంటి సందేహాలు ఉన్నా స్థానిక పోలీసులను లేదా Dial 100 ను సంప్రదించాలి.
సదా మీ సేవలో – కామారెడ్డి జిల్లా పోలీస్