Site icon PRASHNA AYUDHAM

ప్రచార విరామంలో రామచందర్ రావు సాధారణ హోటల్‌లో టిఫిన్ చేస్తూ..

IMG 20251021 WA0033

ప్రచార విరామంలో రామచందర్ రావు సాధారణ హోటల్‌లో టిఫిన్ చేస్తూ..

జూబ్లీహిల్స్‌లో బీజేపీ కదలికలు వేగం పుంజుకుంటున్నాయి

అభ్యర్థి ఎంపికలో ఆలస్యమైనా ఇప్పుడు ప్రచారానికి స్పీడ్‌ ఇచ్చిన బీజేపీ

రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా జూబ్లీహిల్స్‌లో ఇంటింటికి ప్రచారం

స్థానిక నేతలతో కలిసి ఓటర్లను కలుస్తూ బీజేపీకి మద్దతు కోరారు

ప్రజల్లో చురుకైన స్పందన కనిపిస్తున్నదని పార్టీ వర్గాల ఆశాభావం

ప్రచార విరామంలో రామచందర్ రావు సాధారణ హోటల్‌లో టిఫిన్ చేస్తూ హృద్య దృశ్యం

ప్రశ్న ఆయుధం హైదరాబాద్‌, అక్టోబర్‌ 21:

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఇప్పటివరకు నిదానంగా ఉన్న బీజేపీ యంత్రాంగం ఇప్పుడు చురుకుగా కదులుతోంది. అభ్యర్థి ఎంపికలో ఆలస్యమై విమర్శలు ఎదుర్కొన్నా, ఇప్పుడు పార్టీకి ఊపొచ్చిందని నాయకులు చెబుతున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వయంగా ప్రచార రంగంలోకి దిగారు. స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి, బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రజలను కోరారు.

ఉదయాన్నే మొదలైన ప్రచార యాత్రలో ఒక విడత పూర్తయ్యాక, రామచందర్ రావు స్థానికంగా ఉన్న ఓ వీధి హోటల్‌లో సాధారణంగా టిఫిన్ చేస్తూ కనిపించారు. ఆయనతో మాట్లాడేందుకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు హోటల్ చుట్టూ చేరారు. ప్రజల్లోకి చేరి, సాదాసీదా తీరుతో కలిసిపోయే ఈ ప్రచార శైలి, బీజేపీ శిబిరంలో ఉత్సాహాన్ని నింపుతోంది.

Exit mobile version