టెన్త్ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేసిన బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దురిశెట్టి సంపత్

టెన్త్ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేసిన బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దురిశెట్టి సంపత్

మోదీ కానుకగా ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ క్లాస్ చదివే సరస్వతీ పుత్రులందరికి సైకిళ్లు అందిస్తున్న కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్ ఆగస్టు 11 ప్రశ్న ఆయుధం

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుకునే సరస్వతీ పుత్రులందరికీ , విద్యార్ధినీ, విద్యార్థులకు మోడీ కానుకగా కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదినోత్సవం సందర్భంగా సైకిళ్ల పంపణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఆ ప్రోగ్రాం లో భాగంగానే నవాబుపేట ప్రభుత్వ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లను సోమవారం రోజున బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దురిశెట్టి సంపత్ అందజేశారు. ప్రధానమంత్రి ‘‘నరేంద్రమోదీ కానుక’’ పేరుతో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా వివిధ సంస్థల నుండి సేకరించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్సార్) నిధులతో సైకిళ్లను కొనుగోలు చేసి పేద విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారని తెలిపారు.. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో దాదాపు 20 వేల సైకిలను కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ విద్యార్థినీ విద్యార్థులకు అందజేసే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థినీ విద్యార్థులు పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్లే అధిక శాతం ఉంటారని , ఆ పిల్లలు తమ ఇంటి నుండి స్కూల్ దాకా వెళ్లడానికి తగిన రవాణా సౌకర్యాల్లేక,ఆటోలు, బస్సులు వెళ్లే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.విద్యార్థుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టెన్త్ బాలబాలికలకు రవాణా ఇబ్బంది ఉండకూడదనే సదుద్దేశంతో బండి సంజయ్ కుమార్ ప్రధాని మోదీ కానుకగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ శక్తి కేంద్ర ఇన్చార్జి,మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్,మండల దళిత మోర్చ అధ్యక్షుడు అయిల పాక సాగర్.మండల బీ. జే వై.ఏం కార్యదర్శి గుళ్ళ సాయి కృష్ణ. మాజీ వార్డు మెంబర్ మాడ శ్రీనివాస్ ,గ్రామ కార్యదర్శి సంపత్,బూత్ అధ్యక్షులు ఎన్నం సంతోష్,గుళ్ళ రాజు,గుళ్ళ సంతోష్ బీ. జె. పీ నాయకులు గుళ్ళ వెంకటేశం .ఇనుగల సంపత్ రెడ్డి ,పిల్లి రమేశ్,బొల్లి శ్రీకాంత్, ఎర్రోజు సాయికృష్ణ ,బుర్ర సాయికుమార్, విద్యార్థుల తల్లి దండ్రులు, గ్రామస్థులు. పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు

Join WhatsApp

Join Now