మునిగడపలో ఘనంగా దసరా ఉత్సవాలు

మునిగడప లో ఘనంగా దసరా ఉత్సవాలు 

 

జగదేవపూర్ అక్టోబర్ 12 ప్రశ్న ఆయుధం :

 

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామంలో ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహించారు. గడి లో నేరేళ్లపల్లి వెంకన్న, జైపాల్ రెడ్డి, ప్రపంచం రెడ్డి, మహేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో గడి మైసమ్మ కు పూజలు నిర్వహించి అనంతరం వెంకటేశ్వర ఆలయం నుండి వెంకటేశ్వర్ల విగ్రహాలను గ్రామ పురి వీధుల నుండి ఊరేగింపు గా జమ్మి చెట్టు వరకు వెళ్లి రమణ పంతులు ఆధ్వర్యంలో ఆయుధ పూజ చేసి అందరూ పెంచుకొని దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కె వి పి ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మరాటి కృష్ణమూర్తి, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు గుర్రం సుధాకర్, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు మరాటి వెంకటస్వామి, బిజెపి మండల నాయకులు గుర్రం శ్రీధర్ గ్రామ తాజా మాజి సర్పంచ్ బాలకృష్ణ ఐలయ్య, ఉప సర్పంచ్ లావణ్య మల్లేశం,గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now