దసరా పోయింది దీపావళికి వచ్చింది మరల సంక్రాంతికి పోతుందాపథక

సంక్రాంతికి
Headlines
  1. ఇందిరమ్మ పథకం: పండగలకు ముందుకు ఎందుకు ఆలస్యం?
  2. తంబర్ల నరసింహారావు: రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు
  3. మండల ప్రజల ఇళ్ల అవసరాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నది?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు

బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు మండలలో ఒక ప్రకటనలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం దసరా కన్నారు పోయింది దీపావళికి అంటున్నారు దీపావళి వస్తుంది మరల సంక్రాంతికి అంటారా ఇందిరమ్మ ఇండ్ల పథకం మండల ప్రజలకు సక్రమంగా ఇస్తారా అని వారన్నారు మండల పరిధిలో ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు మీరు వస్తేనే మాకు ఇల్లు వస్తాయి అంటూ తెలంగాణ రాష్ట్రంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు అంగీకరించారు అలాంటి ప్రజలకు ఇదిగో ఇందిరమ్మ పథకం వస్తుంది అదిగో ఇందిరమ్మ పథకం వస్తుంది ఆగండి అంటూ ప్రతి పండక్కు ముందుకు జరుపుకుంటూ వెళుతున్న ఆశగా ఎదురుచూస్తున్నారు ఇల్లు లేని మండల ప్రజలు అలాంటి ప్రజలకు నిరాశే చూపుతున్నారు తప్ప పగడ్బందీగా పథకాన్ని అమలు చేసి ప్రతి పేదవారికి సొంత ఇంటి కల నెరవేర్చే దశగా అడుగులు వెయ్యట్లేదు ఎందుకు ఈ ప్రభుత్వానికి ప్రజలపై ఇంత నిర్లక్ష్యం అని ఆయన అన్నారు ఏది ఏమైనాఅప్పటికి ఆరు గ్యారంటీలు ఆకాశంలోనే ఉన్నట్టుగా కనబడుతున్నవి ప్రజలకు అమలు కావట్లేదు ప్రజలకు ఆరుగారంటీలు అందట్లేదు మొదట్లో ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ పథకంలో 3500 ఇండ్లు అన్నారు ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి 3000 ఇండ్లు అంటున్నారు దీపావళి పండగ పోయి సంక్రాంతి వస్తే 2000 ఇండ్లు అంటుందేమో కాంగ్రెస్ ప్రభుత్వం లేక గ్రామపంచాయతీ ఎన్నికల తర్వాతనే అంటుందేమో ఈ ప్రభుత్వం ఇండ్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో మండల ప్రజలు ప్రభుత్వానికి కానరాట్లేదా అని ఆయన అన్నారు ఏది ఏమైనప్పటికీ పండగలకు పథకాలు అంటూ కాలయాపన చేయకుండా ఇందిరమ్మ ఇండ్ల పథకం అతి త్వరగా విడుదల చేసి మండలంలో ఉన్న ప్రతి ఇల్లు లేని పేదవారికి ఇండ్లు అందేలాగా కృషి చేయాలని ఆయన అన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment