ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం : ఎలమంచిలి శ్రీనివాసరావు

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో బుధవారం రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపిటిసి ఫోరం అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాసరావు సందర్శించారు. డాక్టర్ బాలకృష్ణ మరియు కార్యకర్తలను కలిసి మాట్లాడారు. ఎవరైన సరే బాన్సువాడ నియోజక వర్గంలో రాజకీయంగా ఎదుర్కొనలేక తమ కార్యకర్తలపై రౌడీయిజం చేసిన, వారిని భయ బ్రాంతులకు గురి చేసిన సహించేది లేదని, అవసరమైతే ఎక్కడికిన వెళ్లడానికి తాము సిద్ధమేనని, నియోజక వర్గంలో బిఆర్ఎస్ ప్రతి కార్యకర్తకు ఎటువంటి హాని జరుగకుండా అండగా ఉంటామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలకృష్ణ, కొర్రి శివకుమార్ యాదవ్, గుడికొండ సుభాష్, నారం శ్రీనివాస్, గంగప్ప, సాయిలు యాదవ్, మాజీ వార్డు సభ్యులు కుమ్మరి గంగాధర్, మేకల నవీన్, సాయి, రమేష్, కటిక హుసేన్ తదితరులు ఉన్నారు.

తెలంగాణ సాయుద పోరాట యోదురాలు స్వర్గీయ చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ప్రజాప్రతినిధులు, నాయకులు, రజక సంఘాల ప్రతినిధులు.

Join WhatsApp

Join Now

Leave a Comment