ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పదు- మండల పిఆర్టియు నాయకులు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జూన్ 27
ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయునికి పదవి విరమణ తప్పదని మండల పిఆర్టియు అధ్యక్షులు రమణ అన్నారు. శుక్రవారం రోజున బత్తిని మాధవి, మధుకర్, ఎల్ఎఫ్ఎల్, హెచ్ఎం, ఎస్సి వాడ జూన్ 30వ తేదీ వరకు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా శుక్రవారం రోజు స్థానిక వివేకానంద కాలనీలోని సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో జరిగిన పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి టిఆర్టి నాయకులు మండల పిఆర్టియు నాయకులు రూరల్ పిఆర్టియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రధానోపాధ్యాయుడు మధుకర్ కు ఘన సన్మానం చేశారు. బత్తినీ మధుకర్ Sir LFL Hm SC వాడ, కామారెడ్డి, పదవి విరమణ మహోత్సవం అంగ రంగ వైభవంగా కొడుకుల కోడళ్ళు, మనుమలు మనుమరాళ్ళ, ఆత్మీయుల మద్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో Prtu అర్బన్, కామారెడ్డి మండల శాఖ అధ్యక్షుడు dv రమణ, ప్రధాన కార్యదర్శి స్వామి, కామారెడ్డి Prtu రూరల్ శాఖ అద్యక్షుడు హన్మండ్లు, ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, కామారెడ్డి PRTU అర్బన్, మండల కార్యవర్గం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పిఆర్టియు శాఖ అధ్యక్షులు రమణ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడు పదవి విరమణ చేయక తప్పదని మధుకర్ తమ విధుల పట్ల పూర్తిస్థాయిలో విద్యార్థులకు న్యాయం చేసి జీవితం సార్థకత చేసుకున్నాడని ఆయన కొనియాడారు. అంతేకాకుండా పాఠశాలను సుందరంగా తీర్చిదిద్ది విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకునే విధంగా పాఠశాలను పూర్తిస్థాయిలో నవీనీకరణ చేసి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఎస్సీ వాడ పాఠశాలలను తీర్చిదిద్దిన ఘనత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధుకర్ కె దక్కుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గంజి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నీలం లింగం, రాష్ట్ర సహాధ్యక్షులు గోవర్ధన్, తుమ్మ రమేష్, మెరుగు అశోక్, అరుంధతి, సీనియర్ పి ఆర్ టి యు నాయకులు పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, పనిచేస్తున్న ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.