ప్రతి గ్రామపంచాయతీని ఫ్రీ టిబి గ్రామపంచాయతీగా తయారు చేయడానికి కృషి చేయాలి -ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ ప్రతినిధి ప్రభాకర్

*ప్రతి గ్రామపంచాయతీని ఫ్రీ టిబి గ్రామపంచాయతీగా తయారు చేయడానికి కృషి చేయాలి -ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ ప్రతినిధి ప్రభాకర్*

*IMG 20250205 WA0089

ఫిబ్రవరి 5 ప్రశ్న ఆయుధం*

IMG 20250205 WA0088 ప్రభుత్వం చేపట్టిన టీబి ముక్త్ అభియాన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని టీబి ముక్త్ గ్రామపంచాయతీ కార్యక్రమంలో భాగంగా నేడు ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఇల్లందకుంట మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శిలకు టీబి ఫ్రీ గ్రామపంచాయతీ కాన్సెప్ట్ పైన ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు

ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ పుల్లయ్య ,ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ స్టేట్ లీడ్ పురుషోత్తం ,డిస్ట్రిక్ట్ లీడ్ ప్రభాకర్,STS,ట్రైనింగ్ మేనేజర్ సురేందర్ రెడ్డి,దేవేందర్ రెడ్డి హాజరై వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అందరూ ఈ క్షయ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని ఇల్లందకుంట మండలం లోని అన్ని గ్రామాలను టీబి ఫ్రీ గ్రామాలుగా మార్చడానికి అందరి సహాయ సహకారాలు అవసరం ఉందని తెలిపారు

ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్టు ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాను టీబి రహిత జిల్లాగా చేయడానికి జిల్లా క్షయ నివారణ విభాగం జనరల్ హెల్త్ స్టాప్ తో కలిసి కొత్త కేసులను గుర్తించేందుకు ఉన్న కేసులను సక్రమంగా మందులు వాడి ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ పెంచేందుకు పి ఆర్ ఐ ఇన్స్టిట్యూషన్స్ తో కలిసి గ్రామాలలో టీబీ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ప్రతి మండలంలో పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసి వారి ద్వారా టీబి ఫ్రీ పంచాయతీలుగా చేయడానికి కృషి చేస్తామని ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్టు ప్రతినిధి ప్రభాకర్ తెలియజేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment