ప్రతి ఒక్క విద్యార్థి సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన కలిగి ఉండాలి
– సహా చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్, ఎం ఏ సలీం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 3
ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ అప్గ్రేటెడ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (నాగిరెడ్డిపేట్) సారంపల్లి రోడ్ కామారెడ్డి పట్టణం లో సమాచార హక్కు చట్టం 2005 పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ
కార్యక్రమానికి కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ నరేష్, అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సహా చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ శ్రీ ఎం ఏ సలీం పాల్గొని మాట్లాడుతూ
ప్రతి విద్యార్థి సహ చట్టం 2005, విద్యా హక్కు చట్టం, వివిధ చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులకు సమాచార చట్టంతో పాటు విద్యార్కు చట్టం వివిధ చట్టాల పైన అవగాహన కలిగించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా న్యాయ విభాగ అధ్యక్షులు న్యాయవాది ఈక శ్రీనివాసరావు, జిల్లా సలహాదారులు దండగుల లింగమయ్య, హ్యూమన్ రైట్స్ జిల్లా సలహాదారుడు టి రాములు (Retd. ఆర్మీ ), కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.