ప్రతి గ్రామంలో జులై 7న ఎమ్మార్పీఎస్ ఆత్మగౌరవ జెండా ఎగరాలి.
– జిల్లా ఇంచార్జి మంథని షామెల్
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి
(ప్రశ్న ఆయుధం) జులై 3
మాచారెడ్డి మండలం లో ని చుక్కాపూర్ గ్రామంలో మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు బట్ట రమేష్, ఆధ్వర్యంలో చుక్కాపూర్ ఎమ్మార్పీఎస్, గ్రామ నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగ కామారెడ్డి జిల్లా ఇంచార్జి మంథని షామెల్ పాల్గొనీ మాట్లాడుతు ఎమ్మార్పీఎస్ ఏర్పడి 31 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా సందర్బంగా మండలం లోని ప్రతి గ్రామంలో జులై 7న ఎమ్మార్పీఎస్ ఆత్మగౌరవ జెండా ఎగరాలన్నారు. సాయంత్రం సభలు నిర్వహించాలని ఎమ్మార్పీఎస్ ఉద్యమ ఫలాలు సమాజానికి వివరించి సమాజంలో అన్ని వర్గాలను కూడగట్టలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో జిల్లా మహిళ అధ్యక్షులు సత్తి గారి లక్ష్మి , జిల్లా నాయకులు యాదగిరి, రామారెడ్డి మహిళ అధ్యక్షులు లావణ్య, సీనియర్ నాయకులు నర్సింలు, వెంకటేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.