ఎనగంటి రవికాంత్ పార్థిహానికి ప్రగాఢ సంతాపం తెలిపిన

బొమ్మెర శ్రీనివాస్
ప్రశ్న ఆయుధం న్యూస్ జూలై 28 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఎనగంటి అర్జున్ రావు పెద్ద కుమారుడు ఎనగంటి రవికాంత్ హఠాత్తుగా బ్రెయిన్ స్టోక్ తో ఆదివారం రాత్రి అకాల మరణం చెందారు.
టేకులపల్లి మండల కేంద్రoలో సోమవారం అంత్యక్రియలు చేపట్టారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ ఎనగంటి రవికాంత్ పార్థిహానికి జోహార్లు అర్పించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆర్.ఎం.పి వైద్యులుగా మండలంలో మంచి గుర్తింపు ఆదరణ అభిమానాలు పొందినారు.రవికాంత్ అతి చిన్న వయసులోనే అకాల మరణం చెందారు.భార్య కూతురు ఉన్నారు.ఆయన లేని లోటు ఆ కుటుంబానికే కాదు ఆ ప్రాంతానికి తీరనిదని కుటుంబ సభ్యులు,
బంధువులు,అభిమానులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి నాయకులు మీసాల రాములు,కండె రాములు,ఎనగంటి శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now