ఆటో డ్రైవర్ల ముందస్తు అరెస్ట్

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 20 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో ఆటో డ్రైవర్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆటో డ్రైవర్ల యూనియన్ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా తాము ఉపాధి కోల్పోయామని, ప్రభుత్వం ప్రకటించిన రూ.12,000 జీవన భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలన్నారు.

Join WhatsApp

Join Now