Site icon PRASHNA AYUDHAM

బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్ 

బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్

బీజేవైఎం రాష్ట్ర శాఖ ధర్నా కార్యక్రమ పిలుపు మేరకు బయల్దేరిన కోరుట్ల బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కలాల సాయిచంద్, ప్రధాన కార్యదర్శులు గోనెల రాజశేఖర్, మర్రిపెళ్లి నవీన్, ఉపాధ్యక్షుడు ధమ్మ సంతోష్, ఏడమనపెళ్లి సాయి, బీజేవైఎం మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి రాజు తదితర నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి కోరుట్ల పోలీస్ స్టేషన్ కు తరలింఛారు. అరెస్ట్ అయిన బీజేవైఎం నాయకులను బిజెపి ఫ్లోర్ లీడర్ మాడవి నరేష్, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి చెట్లపల్లి సాగర్ లు కలిసి పరామర్శించి వారికి అల్పాహారం అందజేశారు.

Exit mobile version