మాజీ సర్పంచుల ముందస్తు అరెస్ట్

*అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మాజీ సర్పంచులను అరెస్టు చేసిన పోలీసులు*

*పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి*

*వీణవంక మాజీ సర్పంచ్ నీల కుమారస్వామి*

*జమ్మికుంట వీణవంక ప్రశ్న ఆయుధం ఆగస్టు 2*

తెలంగాణ రాష్ట్రంలో పల్లెల ప్రగతి పథంలో తమ వంతు సేవలందిస్తూనే గ్రామంలోని అభివృద్ధి పనులైన సిసి రోడ్లు సైడ్ డ్రైనేజీలు హైమస్ లైట్లు పంచాయతీ భవనాలు స్మశాన వాటికలు కుల సంఘాల భవనాల పాఠశాలల నిర్మాణాలు చేపట్టి బిల్లులు రాక సర్పంచులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులు పిలుపుమేరకు శుక్రవారం అసెంబ్లీ ముట్టడి ఉండగా బయలుదేరందుకు సిద్ధమవుతున్న వీణవంక మండలంలోని వీణవంక రెడ్డిపల్లి ఘన్ముక్ల చల్లూరు దేశాయిపల్లి గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులను శుక్రవారం ఉదయం 4 గంటలకు వీణవంక పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ తరలించారు మాజీ సర్పంచ్లులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో భాగంగా మాకు ఉన్న ఆస్తులు అమ్మి, అప్పులు తెచ్చి గ్రామంలోని అభివృద్ధి పనులు చేశామని కానీ ప్రభుత్వం 6 గ్యారంటీల పథకంతో పాత బకాయిలను ఇచ్చిన దాఖలు లేవని ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్న మాజీ సర్పంచులు బిల్లులు రాక అప్పుల పాలై తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా పాత బకాయిలను వెంటనే చెల్లించాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు ఈ అరెస్టులో వీణవంక మాజీ సర్పంచులు నీల కుమారస్వామి రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పోతుల నరసయ్య ఘన్ముక్ల మాజీ సర్పంచ్ జున్నుతుల సునీత మల్లారెడ్డి చల్లూరు మాజీ సర్పంచ్ పొదిళ్ల జ్యోతి రమేష్ దేశయిపల్లి మాజీ సర్పంచ్ గాలేటి జ్యోతి సురేందర్ రెడ్డి లు తదితరులు ఉన్నారు

Join WhatsApp

Join Now