మాల మహానాడు నాయకుల ముందస్తు అరెస్ట్

*మాల మహానాడు నాయకుల ముందస్తు అరెస్ట్*

*అరెస్టును తీవ్రంగా ఖండిస్తు మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మాదాసు మొగిలి*

*ఇల్లందకుంట జనవరి 6 ప్రశ్న ఆయుధం*

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గాజుల భాస్కర్ పిలుపుమేరకు రాష్ట్రంలో గల బిజెపి కార్యాలయాలపై ముట్టడి మాల మహానాడు పిలుపు ఇవ్వడంతో సోమవారం రోజున మాల మహానాడు నాయకులను ముందస్తు అరెస్టు చేయడం జరిగిందని దీనిని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మాదాసు మొగిలి తీవ్రంగా ఖండించారు కేంద్ర ప్రభుత్వం అణచివేతకు నిరసనగా బిజెపి కార్యాలయాలను ముట్టడించడం జరుగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ ఎత్తివేయాలని ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణకు తెరతీసిందని విద్య ఉద్యోగ పరంగా రాజకీయపరంగా అణిచివేయాలని దురుద్దేశంతో ఎలాంటి అవకాశాలు లేకుండా చేయడం కోసం మాలలపై దుష్ప్రచారం చేసి అనగదొక్కాలని బిజెపి ప్రభుత్వం చూస్తుందని దుయ్యబట్టారు ఎన్ని అరెస్టులు చేసిన మా ఉద్యమం ఆగదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భోగం చిరంజీవి మండల అధ్యక్షుడు తాడెం దిలీప్ తదితరులు ఉన్నారు

Join WhatsApp

Join Now