*మాల మహానాడు* *నాయకుల ముందస్తు* *అరెస్టు ఆ ప్రజాస్వామికం*
ప్రశ్న ఆయుధం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 19:
ఎస్సీ వర్గీకరణ కు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట చైర్మన్ చెన్నయ్య ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలోని రాష్ట్ర. జిల్లా మరియు కార్యకర్తలను గృహ నిర్బంధము మరియు అర్ధరాత్రి వేళ అరెస్టు చేయడము ఎంతవరకు సమంజసమని కామారెడ్డి జిల్లా నాయకులు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల రాజనర్సింహులు, డిమాండ్ చేశారు దేవున్ పల్లి పోలీస్ అధికారులు రాత్రి వేళలో కామారెడ్డి జిల్లాకు చెందిన గోనుగుప్పుల లింగం, ఎడ్ల రాజు, పెరుమళ్ళ రాములు, జిల్లా నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి లక్షల మంది మాలలతో అసెంబ్లీని ముట్టడిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వర్గీకరణ అనే అంశం రాజకీయ కుట్రలో ఒక భాగం కాబట్టి దీనిని ఎలాగైనా అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు.