*మాజీ సర్పంచుల ముందస్తు అరెస్టులు*
తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల సర్పంచ్లను సోమవారం రోజున పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ మాజీ సర్పంచుల ఉపాధ్యక్షులు మాట్ల మధు మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు చెల్లించాలని చలో అసెంబ్లీ ముట్టడిస్తామని బయలుదేరుతున్నామని ముందస్తు సమాచారంతో మండలంలోని మాజీ సర్పంచ్లను అరెస్టు చేయడం జరిగిందని అలాగే రాష్ట్ర ప్రభుత్వం మాజీ సర్పంచ్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని లేనియెడల పెద్ద ఎత్తున సమ్మెను చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. అరెస్ట్ అయిన వారిలో జిల్లా జేఏసీ వైస్ ప్రెసిడెంట్ గణప శివజ్యోతి, జిల్లా జేఏసీ కార్యవర్గ సభ్యులు సురభి సరిత నవీన్ రావు, మండల మాజీ సర్పంచ్లు ఉన్నారు.