*పర్యావరణహిత హోలీ రంగుల ప్రదర్శన*
ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి :
హోలీ పండుగ సందర్భంగా
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్ష శాస్త్రం, ఫారెస్ట్, రసాయన శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రకృతిలో లభించే సహజమైన వివిధ రకాల మొక్కల భాగాలైన గోగుపువ్వు, మందార, శంకు పూలు, నారింజ తోలు, బీట్రూట్, పాలకూర, క్యారెట్ నుండి ఎలాంటి రసాయనాలను కలపకుండా వివిధ రంగులను తయారు చేసి ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు తయారుచేసిన చూర్ణాలను ప్రిన్సిపాల్, బోధన, బోధనేతర సిబ్బంది రంగులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కిష్టయ్య, ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ జయప్రకాష్, వృక్ష శాస్త్ర విభాగాధిపతి దినకర్, అధ్యాపకులు శ్రీవల్లి, శ్రీలత, స్వాతి, రాజశ్రీ, మానస, శ్రీలత ,శారద, శ్రీనివాస్, వెన్నెల వర్షిని, రమణ, రాజేందర్ పాల్గొన్నారు.