మధ్యాహ్న భోజన స్కీంలో సమస్యలున్నయ్‌ : విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి..!!

*మధ్యాహ్న భోజన స్కీంలో సమస్యలున్నయ్‌ : విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి..!!*

బ్రహీంపట్నం, : మధ్యాహ్న భోజన పథకంలో చాలా సమస్యలు కనపడుతున్నాయని విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ జడ్పీహెచ్‌ఎస్‌ను బుధవారం తనిఖీ చేశారు.

వంటగది, మెనూను పరిశీలించి భోజన క్వాలిటీ, సమస్యలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టూడెంట్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంలో అసలు సమస్య ఎక్కడ వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మధ్యాహ్నభోజన పేమెంట్స్‌లో ఆలస్యం జరుగుతుందని, ధరల్లో కూడా తేడాలు ఉన్నాయన్నారు. పెండింగ్‌ బిల్లుల చెల్లింపు కోసం సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తామని చెప్పారు. అంతకుముందు స్టూడెంట్లతో కలిసి స్కూల్‌లోనే మధ్యాహ్న భోజనం చేశారు. ఆయన వెంట రంగారెడ్డి డీఈవో సుశీంధర్‌ రావు, జడ్పీహెచ్‌ఎస్‌ టీచర్లు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment