ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 3 భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఆర్ సి
చదువు బ్రతుక్కి దారి చూపుతుంది
శ్రీ విద్యాభ్యాస పాఠశాల విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పీకే ఓసి ప్రాజెక్టు అధికారి తాళ్లపల్లి లక్ష్మీప తి గౌడ్
చదువు బ్రతుక్కి దారి చూపుతుందని ఏకాగ్రతతో చదువుపై దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి మరియు కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సి ఎం ఓ ఏ ఐ)సింగరేణి శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ అన్నారు. మణుగూరు మండలంలోని సంతోష్ నగర్ శ్రీ విద్యాభ్యాస పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అమెరికాలో ఉన్న తమ కుమార్తె కౌసల్య, అల్లుడు వినయ్ కుమార్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు
శ్రీ విద్యాభ్యాస పాఠశాల లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్, కరుణ
శ్రీ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ విద్యార్థి అయినా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ఏకాగ్రతతో కూడిన చదువు చక్కటి దారి చూపుతుందని ప్రపంచవ్యాప్తంగా చదువుకున్న విలువ మరొకదానికి లేదని ఆయన అన్నారు. కుమార్తె అల్లుడు పెళ్లి రోజు సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేశారు. పండ్లు బిస్కెట్ ప్యాకెట్లను కూడా అందజేశారు. బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక” బెస్ట్ సర్వీస్ సొసైటీ” జాతీయ అవార్డుకు ఎంపికైన పాఠశాల నిర్వాహకులు బి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్య అతిథులు శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో పీకే ఓసి రక్షణ అధికారి ఎం లింగబాబు, సుధాకర్ బాబు.
సింగరేణి సేవా సమితి సభ్యులు యస్ డి నా సర్ పాషా అంగోత్ మంగీలాల్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
చదువు బ్రతుక్కి దారి చూపుతుంది విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ
by Naddi Sai
Published On: December 3, 2024 8:07 pm